ముంబై హీరోయిన్ జెత్వానీ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్న ను అరెస్టు చేసిన పోలీసులు, తెల్లవారుజామున పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజుల రి మాండ్ విదించింది. విద్యాసాగర్ ను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నవారు.
పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలను నిందితులుగా చేర్చారు. ఏ1గా విద్యాసాగర్, ఏ2గా అప్పట్లో జెత్వానీ కేసును దర్యాప్తు చేసిన విచారణాధికారి సత్యనారాయణ, ఏ3గా పీఎస్సార్ ఆంజనేయులు, ఏ4గా కాంతి రాణా, ఏ5గా విశాల్ గున్నీ ఉన్నారు.
కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండటంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు పడే అవకాశముంది. కాంతి రాణా టాటా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్ 24 వరకు కాంతి రాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పై రేపు తీర్పు చెప్పనుంది.