చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 280 పరుగుల తేడాతో నెగ్గింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. జడేజా ముగ్గురిని పెవిలియన్ కు పంపాడు. బుమ్రా ఒక వికెట్ తీశాడు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్స్ లో భారత జట్టు 287 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్ ను డిక్లేర్ చేసిన రోహిత్ సేన, బంగ్లా ముందు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
బంగ్లా బ్యాట్స్‌మెన్ లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో ఒక్కడే శ్రమించాడు. 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అశ్విన్ ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 234 పరుగులు మాత్రమేచేయగల్గింది. భారత జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది.
ఓవర్‌నైట్ 158/4 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్, కెప్టెన్ షాంటోతో కలిసి షకిబ్ అల్ హసన్ (25) కాసేపు అడ్డుకోగలిగాడు.
లంచ్ బ్రేక్ లోపే బంగ్లా చేతులెత్తేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఘనత సాధించాడు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల