ఒడిశాలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ లో మరోమారు సాంకేతిక సర్వే ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రతీరోజు మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని శ్రీజగన్నాథ్ ఆలయ పరిపాలనా విభాగం అధికారులు స్పష్టం చేశారు. సర్వే జరుగుతున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తామని భక్తులు సహకరించాలని కోరారు.
ఆలయ పరిసరాల్లో రహస్య గది, సొరంగం ఉన్నా యా? లేదా అనేది తేల్చబోతున్నామని రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ వివరించారు. సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దసరా నవరాత్రులు, కార్తీక మాసంలో జరిగే పూజలకు అడ్డంకులు లేకండా సర్వేను సాధ్యమైనంత తొందరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు.