దిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అతిశీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతన నేతలు హాజరయ్యారు.
అతిశీ కేబినెట్ లో గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
దిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నెలలు పాటు తీహార్ జైల్లో ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ రాజీనామాతో అతిశీ సీఎంగా ప్రమాణం చేశారు.
కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిశీ శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఏకైక మహిళా మంత్రిగా ఇప్పటి వరకు ఆమెపని చేశారు. సెప్టెంబర్ 17న జరిగిన పార్టీ శాసన సభ్యుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిశీని సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.