చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లా జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.ఇంకా 10 ఓవర్లు ఉన్నాయనగా వెలుతురు తగ్గిపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. హుస్సేన్ శాంటో ( 51*), షకీబ్ అల్ హసన్ (5*) క్రీజులో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది.
తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో 287/4 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 149 పరుగులకే పెవిలియన్ చేరింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాలంటే 357 పరుగులు చేయాల్సి ఉంది.
రెండో రోజు ఆటలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా మూడో రోజు శుభ్‌మన్ గిల్(119 నాటౌట్), రిషభ్ పంత్(109)లు శతకాలతో అదరగొట్టారు.