భారత వాయుసేన తదుపరి అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం వాయు సేన వైస్ చీఫ్గా ఆయన సేవలు అందిస్తున్నారు. వాయుసేన చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది. అమర్ప్రీత్ సింగ్ సెప్టెంబరు 30న వాయుదళ చీఫ్గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అమర్ ప్రీత్ సింగ్ 1964 అక్టోబరు 27న జన్మించారు.నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984లో భారత వైమానిక దళంలో చేరారు. ఎయిర్ మార్షల్ యుద్ధ స్క్వాడ్రన్, ఫ్రంట్లైన్ ఎయిర్ బేస్కు నాయకత్వం వహించారు.
నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఫ్లైట్ టెస్ట్)గా పనిచేసిన అమర్ ప్రీత్ , మాస్కోలో MiG-29 అప్గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బృందానికి నాయకత్వం వహించారు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ పరీక్షలను ఆయన పర్యవేక్షించారు.