చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్ళు శుభమన్ గిల్, రిషబ్ పంత్ పోటీపడీ మరీ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. గిల్, పంత్ లు బాదిన బౌండరీ షాట్ల ను అడ్డుకోవడానికి బంగ్లాదేశ్ ఆటగాళ్ళు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఒక దశలో బంగ్లా ఫీల్డింగ్ ను కూడా పంత్ నే సెట్ చేశాడు.
ఓవర నైట్ 81/3 స్కోరుతో మూడో రోజు ఆటను మొదలు పెట్టిన భారత్, భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆ తర్వా త కూడా శుభ్‌మన్ గిల్ రిషభ్ పంత్ జోరు కొనసాగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే పెవిలియన్ చేరింది.
మూడో రోజు ఆట ప్రారంభంలో రిషభ్ పంత్ ,గిల్ ఆచితూచి ఆడారు. ఆ తర్వాత మాత్రం ఒక్కో బంతిని చాచికొట్టారు. మెహిదీ హసన్‌ను లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఈ సెషన్లో భారత్ 28 ఓవర్లలో 124 పరుగులు చేసింది.
రిషబ్ పంత్ టెస్టుల్లో ఆరో సెంచరీ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 128 బంతులు ఆడి 109 పరుగులు చేశాడు. ఏకంగా 13 ఫోర్లు, నాలుగు సెక్సులు బాదాడు. 88 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు.
పంత్ కు తోడు శుభమన్ కూడా చితకకొట్టుడు కొట్టాడు. తన సహజ శైలి లో భాగంగా ఏ మాత్రం వెరకకుండా బౌండరీలు బాదాడు. 161 బంతులు ఆడి సెంచరీ చేశాడు. 90 పరుగులు తర్వాత మాత్రం కొద్దిగా జాగ్రత్త పడ్డాడు. 161 వ బంతిని బౌండరీ కొట్టి శతకం కొట్టాడు. టెస్టుల్లో 5 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ చేరాడు.
పంత్ పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ సమయోచితంగా ఆడాడు. గిల్ సెంచరీ పూర్తి చేసేందుకు సాయపడ్డాడు. కేఎల్ రాహుల్ 19 బంతులు ఆడి 4 ఫోర్లు బాది 22 పరుగులు చేశాడు. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసి, బంగ్లాదేశ్ ఎదుట 515 పరుగులను టార్గెట్ ఉంచింది.
బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మీర్జా రెండు వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.