ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి రైతుల ఖాతాలకు సొమ్ము జమ అయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతీ రైతుకీ గౌరవం దక్కేలా కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో రవాణాకి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు ప్రతీ బస్తా ట్రాన్స్‌పోర్టు డేటా తెలుసుకునే జీపీఎస్ వ్యవస్థ ఉంటుందన్నారు. పూర్తిస్థాయిలో సంచులు సిద్ధం చేస్తున్నామన్నారు.
విజయవాడలో నిర్వహించిన పౌరసరఫరాల శాఖ వర్క్‌షాప్‌లో ఎండీ వీరపాండియన్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ మంజిర్ జిలానీ సమూర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.