వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం పంచాయతీలో భూదాన్ భూములను వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆక్రమించారు. పల్లిపాలెం గ్రామస్థులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు ప్రారంభించారు. తోట త్రిమూర్తులు ఆక్రమించిన 29 ఎకరాల పంట భూములతోపాటు, పది ఎకరాల చెరువులు స్వాధీనం చేసుకున్నారు.
ఆక్రమించిన భూముల్లోని షెడ్లను పొక్రెయినర్లతో తొలగించారు. భూదాన్ భూములు ఆక్రమించి గ్రామస్తులపైనే బెదిరింపులకు దిగడంతో తోట త్రిమూర్తుల అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో ఫిర్యాదు చేసినా కదలని రెవెన్యూ అధికారులు, తాజాగా చర్యలకు ఉపక్రమించారు.