విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏపీకి చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం ఆమె గదిలో ఉరేసుకుని కనిపించిందని సహచర విద్యార్ధులు తెలిపారు. సూసైడ్ నోట్ బయటపడింది. విద్యార్థిని ఆత్మహత్యపై క్యాంపస్ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఎన్ఐటీ పాలనా భవనం ముందు తీవ్ర నిరసన తెలిపారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. చదువుల్లో ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడిందా? మరేదైనా కోణం ఉందా అనే విషయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.