ప్రముఖ బీమా కంపెనీ స్టార్ హెల్త్‌పై తీవ్ర దుమారం రేగింది. స్టార్ హెల్గ్కు చెందిన ఓ సీనియర్ అధికారి 3 కోట్ల మంది ఖాతాదారుల సమాచారాన్ని అమ్మేశాడంటూ బ్రిటన్ భద్రతా అధికారి జేసన్ పార్కర్ వెల్లడించారు.జెన్జెన్ అనే హ్యాకర్ ఈ సమాచారాన్ని తన వెబ్సైటులో ఉంచినట్లు జేసన్ తెలిపాడు. దాదాపు కోటి 40 లక్షలు ముడుపులు తీసుకుని స్టార్ హెల్త్ ఉన్నతాధికారి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
ఖాతాదారుల వివరాలు, వారి అనారోగ్య వివరాలు, బీమా క్లెయిముల వివరాలన్నీ హ్యాకర్ల చేతిలో పడ్డాయి. ఇందులో ఖాతాదారుల బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సమాచారం ఇలా హ్యాకర్ల చేతికి చేరడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై స్టార్ హెల్త్ సంస్థ స్పందించలేదు.