అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ముందస్తు ఓటింగ్ మొదలైంది. నవంబరు 5న అమెరికాలో ఎన్నికలు జరగనుండగా, అప్పుడు హాజరు కాలేని వారు ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నిక రేసులో ఉన్న కమలా హారిస్, ట్రంప్ భవితవ్యాన్ని ముందస్తు ఓటింగ్ సరళి తేల్చనుంది. అమెరికాలో 47 రాష్ట్రాల్లో ఈ ముందస్తు ఓటింగ్ సదుపాయం ఉంది. దాదాపు 50 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్ తప్పనిసరి చేయగా, మూడు రాష్ట్రాల్లో మాత్రం ఈ సదుపాయం లేదు. ఇది ఒక రకంగా పోస్టల్ బ్యాలెట్ లాంటిదని చెప్పవచ్చు. దాదాపు 23 లక్షల మంది ఈ ఓటింగ్ చేసే అవకాశముంది. 50 రోజుల తరవాత ఓటింగ్ సరళిని అధికారులు పరిశీలిస్తారు.