తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం జరిపిస్తోన్న విజిలెన్స్ విచారణ నిలిపివేసేలా ఆదేశించాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తిరుమలలో విచారించే అధికారం విజిలెన్స్‌కు లేదని, తిరుమలకు ప్రత్యేక విజిలెన్స్ వ్యవస్థ ఉందని సుబ్బారెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.ఏపీ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ డైరెక్టర్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
విజిలెన్స్ అధికారులు విచారణకు రావాలని పిలిచారని, వివరాలు ఇవ్వాలని కోరగా ఎలాంటి ఫైల్స్ తనకు ఇవ్వలేదని సుబ్బారెడ్డి తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనను విచారించకుండానే విజిలెన్స్ విచారణ పూర్తి చేశారని, అసలు తిరుమలలో విచారించే అధికారం వారికి లేదంటూ వాదనలు వినిపించారు. తనపై జరుగుతోన్న విజిలెన్స్ విచారణ నిలిపేసేలా ఆదేశించాలంటూ సుబ్బారెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.