ముంబై నటి కాదంబరి జత్వానీపై ఫోర్జరీ డాక్యుమెంట్లతో కేసులు నమోదు చేసి వేధించిన వ్యవహారంలో వైసీపీ యువనేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. సాంకేతిక సహకారంతో విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడి ఫోన్ వాడిన విద్యాసాగర్ పోలీసులకు చిక్కారు. పలు సెక్షన్ల కింద కుక్కల విద్యాసాగర్‌పై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ముంబై నటిని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ ఏ1గా ఉన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. కుక్కల విద్యాసాగర్‌ను ఎక్కడ అరెస్ట్ చేశారనే విషయం తెలియాల్సి ఉంది. రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.