చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్వల్ప స్కోర్ కే ముగిసింది. 149 పరుగుల స్వల్ప స్కోరుకే బంగ్లాదేశ్ ఆలౌట్ కావడంతో భారత్‌కు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
షకీబ్ అల్ హసన్(32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ప్లేయర్ మెహదీ హసన్ మిరాజ్(27) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షద్మన్ ఇస్లామ్( 2), జాకీర్ హసన్( 3), శాంటో (20), మొమీనుల్( 0), ముష్ఫీకర్ రహీమ్( 8), లిట్టన్ దాస్( 22), హసన్ మహ్మద్( 9), టాస్కిన్ అహ్మద్( 11), నహీద్ రానా (11) పేలవ ప్రదర్శన చేశారు.
రెండోరోజు ఆటలో భాగంగా భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌ను యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ప్రారంభించారు.అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో 15 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ నష్టపోయింది. తస్కిన్ అహ్మద్ వేసిన 2.3 బంతికి జాకీర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఏడు ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు నష్టపోయి కేవలం 28 పరుగులు మాత్రమే చేయగల్గింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టు ఆధిక్యం 308కి చేరింది. విరాట్ కోహ్లీ (17) మరోసారి నిరాశపరిచాడు.
క్రీజులో గిల్ (33), పంత్ (12) ఉన్నారు.