నక్సలైట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి హెచ్చరిక జారీ చేశారు. హింసను వీడి ఆయుధాలను వదిలిపెట్టకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
చత్తీస్‌గడ్‌లో నక్సల్ హింసలో బాధితులుగా ఉన్న 55 మందితో ఆయన మాట్లాడారు. 2026 మార్చి 31న మావోయిస్టులు తమ చివరిశ్వాస పీల్చుకుంటారని మంత్రి అమిత్ షా అన్నారు. నక్సల్ హింస, ఐడియాలజీ పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రధాని మోదీ నిర్ణయించారని మంత్రి షా తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్లు ఆయుధాలు వీడినట్లే నక్సల్స్ కూడా హింసకు దూరంగా ఉండాలని కోరారు. మావోయిస్టులపై జరుపుతున్న ఆపరేషన్లలో భద్రతా దళాలు మెరుగైన ప్రగతి సాధించామన్నారు. చత్తీస్ గడ్‌లోని కేవలం 4 జిల్లాలకే మావోలు పరిమితం చేశామన్నారు.
నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు కారిడార్‌ను ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ప్రణాళిక రచిస్తే మోదీ సర్కార్ దానిని భగ్నం చేసిందన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంత ప్రజలు సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించనున్నట్లు తెలిపారు.