చెన్నైలోని ఎమ్ఏ చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. రెండో రోజు ఆటలో భాగంగా నాలుగు వికెట్లను భారత్ కొల్పోయింది. బంగ్లా బౌలర్ తస్కిన్ రెండో రోజు మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి న్నింగ్స్‌లో స్పీడ్‌స్టర్ హసన్ అహ్మద్ అయిదు వికెట్లు తీశాడు.
తొలి రోజు ఆరు వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసిన భారత్, రెండో రోజు కేవలం 37 పరుగులు మాత్రమే చేయగల్గింది. సెంచరీకి చేరువు అవుతున్న జడేజా 86 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ 17 రన్స్ చేసి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. అశ్విన్ కూడా తస్కిన్ బౌలింగ్ లో 113 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అశ్విన్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి.
యశస్వీ జైస్వాల్ (56), రోహిత్ శర్మ(6), శుభమన్ గిల్(0 ), విరాట్ కోహ్లీ (6) వికెట్ కీపర్ రిషబ్ పంత్ (39), కేఎల్ రాహుల్ (16), జడేజా(86), అశ్విన్(113), ఆకాశ్ దీప్ (17), బుమ్రా(7), సిరాజ్ (0)గా వెనుదిరిగారు.
భారత్ 91.2ఓవర్లు ఆడి 376 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ 5 వికెట్లు తీయగా తస్కిన్ 3, మెహిదీ, నహిద్ ఒక్కో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ తొలి ఓవర్ ఆఖరి బంతికి మొదటి వికెట్ నష్టపోయింది. బుమ్రా బౌలింగ్ లో
ఓపెనర్ సద్మన్ ఇస్లాం వెనుదిరిగాడు. జకీర్ హాసన్, నజ్మల్ హుస్సేన్ క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోర్ 12/1 గా ఉంది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల