తెలంగాణలో దసరా సెలవులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలుగు కేలెండర్ మేరకు ఈ ఏడాది దసరా అక్టోబర్ 12న రానుంది. దీంతో అక్టోబర్ 2 నుంచి 14 వరకు సెలవులు ప్రకటించినట్లు తెలంగాణ పాఠశాల అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (Gandhi Jayanti 2024) నాడు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2న చేస్తారు. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతోఈ సంబరాలు ముగుస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ కేలెండర్ను విడుదల చేసింది. ఆ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉంది. ప్రస్తుతం దసరా సెలవులు ఆ రోజు నుంచే ప్రారంభం అవుతున్నాయి.
డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు.. జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని కేలండర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. . 2025 మార్చిలో 10 తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.