పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. పేజర్లు, వాకీటాకీలు, సౌర పరికరాల పేలుళ్ల తరవాత హెజ్బొల్లా దాడులు తీవ్రతరం చేసింది. దీంతో ముందుగానే హెజ్బొల్లా ఆయుధాగారాలపై ఇజ్రాయెల్ సైన్యం మెరుపుదాడులకు దిగింది. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రధాన ఆయుధాగారంపై దాడి చేసి వెయ్యి రాకెట్లు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఏడాది కాలంగా హమాస్ ఇజ్రాయెల్ మధ్య సాగుతోన్న యుద్ధం తాజాగా లెబనాన్‌కు విస్తరించింది. దీంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ఇప్పటికే అమెరికా సైన్యం లెబనాన్‌లో ఉంది. మరికొంత మందిని అక్కడకు పంపేంచేందుకు సిద్దమవుతోందని తెలుస్తోంది.
విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను నిషేధిస్తున్నట్లు లెబనాన్ ప్రకటించింది. ఖతర్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. బీరుట్ నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను అనుమతించడం లేదు.