జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి గెలుస్తుందని జోస్యం
కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, భారత్‌లోని కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ ఒకే వైఖరితో ఉన్నాయని ఆదేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది.
పాకిస్తాన్‌లోని జియో న్యూస్‌తో మాట్లాడిన ఆసీఫ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీ అలయన్స్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ పునరుద్ధరణ విషయంలో కూటమిది, తమ వైఖరి ఒకేలా ఉందని ఆసిఫ్ అన్నారు.
ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని నేషనల్‌కాన్ఫరెన్స్ చెబుతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది.