వరద బాధితులకు అదానీ గ్రూప్ భారీ సాయం అందించింది. ప్రపంచ కుబేరుల అగ్రజాబితాలో చోటు సాధించిన అదానీ, వరద బాధితులకు రూ.25 కోట్ల సాయం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇందుకు సంబంధించిన చెక్కును ఆ సంస్థ ఎండీ కరణ్ అదానీ అందించారు. ఈ విషయాన్ని సీఎం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
వరద బాధితులకు వేలాది మంది ఉదారంగా సాయం అందించారు. ఇప్పటి వరకు రూ.350 కోట్ల సాయం అందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సాయం ప్రకటించనుంది. వరద బాధితులకు ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.