ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందంటూ షెన్బెట్ ఏజన్సీ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి యోవా గల్లాంట్, షిన్బెడ్ డైరెక్టర్ రోనెన్ కూడా ఇరాన్ హిట్ లిస్టులో ఉన్నట్లు ప్రకటించింది. హమాస్ ముఖ్యనేత హత్య తరవాత ఇరాన్ ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పేర్కొంది. ఇందుకు ఇజ్రాయెల్‌కే చెందిన ఓ వ్యాపారిని కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం.
ఉగ్రవాద సంస్థ హమాస్ కీలక నేత హనియే హత్యపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. హనియే హత్యకు కొద్ది గంటల ముందే ఇజ్రాయెల్ దళాలు హెజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్ర్‌ను హతం చేశాయి. అయితే హనియే విషయంలో మాత్రం ఇజ్రాయెల్ మౌనం వహించింది.