రాజకీయాలు మాటున జమ్ముకశ్మీర్‌ను ను ఓ మూడు కుటుంబాలు దోచుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ
మూడు పార్టీలు జమ్ము కశ్మీర్ యువత భవిష్యత్తును నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మూడు పార్టీలు కశ్మీర్ యువత చేతికి రాళ్ళు ఇచ్చి విధ్వంసాలు సృష్టించేవన్నారు. బీజేపీ మాత్రం పుస్తకాలు, కలాలు ఇస్తోందన్నారు.
పాఠశాలలను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటే వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఎయిమ్స్, ఐఐటీ తో పాటు ఉపాధి అవశాలు లభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
బడి మానేసిన 50 వేల మంది విద్యార్థులను తిరిగి స్కూల్స్‌కు రప్పించామన్నారు. లాల్‌చౌక్ లో ఒకప్పుడు ఉగ్రదాడులు జరిగితే నేడు ఇంటర్నేషనల్ యోగా డే లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రైల్ కనెక్టివిటీ కూడా పెరగడంతో పర్యాటకరంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జమ్మూ కశ్మీర్ లో నిన్న తొలివిడత పోలింగ్ ముగిసింది.