వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి బాలినేని బాటలోనే ఉదయభాను జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు ఉదయభాను ప్రకటించారు. వైసీపీ అధినేత విధానాలు నచ్చక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ జనసేన అధినేతను కలవనున్నారు. అందరూ ఊహించినట్లే బాలినేని జనసేనలో చేరడం దాదాపుగా ఖరారైంది. జగన్మోహన్రెడ్డి ఒంటెత్తు పోకడలు నచ్చకే పార్టీని వీడుతున్నట్లు బాలినేని ప్రకటించారు. గుంటూరుకు చెందిన మరో మాజీ మంత్రి కూడా జనసేనలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.