ఆంధ్రప్రదేశ్ కు ఈ నెలాఖరులో తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశముంది.
తుపానుగా మారితే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో 20 నుంచి ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడా వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.