భారత ఏవియేషన్ చరిత్రలో స్కాడ్రన్ లీడర్ మోహనాసింగ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఫైటర్ జెట్ స్కాడ్రన్ నిర్వహించే ఎలైట్ 18 ‘ఫ్లయింగ్ బులెట్స్’ స్కాడ్రన్‌లో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
భారత వైమానిక దళంలోని ముగ్గురు మహిళా ఫైలట్లు ఉండగా అందులో స్కాడ్రన్ లీడర్ మోహనాసింగ్ ఒకరు. మిగతా ఇద్దరు భావనాకాంత్ కాగా, అవనీ చతుర్వేది. 2016లో ప్రభుత్వం మహిళల కోసం ఫైటర్ స్ట్రీమ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో దాదాపు 20 మంది మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు.
విమానాలు, హెలికాప్టర్లను 1991 నుంచి మహిళలు నడుపుతున్నారు. 2016 నుంచి యుద్ధ విమానాల నిర్వహణకు కూడా భారత ప్రభుత్వం అవకాశం కల్పించింది. మోహనా సింగ్ తొలిసారి మిగ్ 21 ను నడిపారు. ఆ తర్వాత గుజరాత్ నలియా ఎయిర్ బేస్ వేదికగా పాకిస్తాన్ బోర్డర్ లో విధి నిర్వహణలో ఉన్నారు.
రాజస్థాన్ లోని ఝుంఝుంను జిల్లా మోహనా సింగ్ జన్మస్థలం. ఆమె తాత ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ లో ఫ్లైట్ గన్నర్ గా పనిచేయగా, తండ్రి వారెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు.