లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటోంన్న ఏలూరు జిల్లాకు చెందిన అరాచక వార్డెన్ శశికుమార్‌పై వేటు పడింది. శశకుమార్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రెండో భార్య, మేనకోడలు సహకారంతో బాలికలపై లైంగిక దాడికి దిగినట్లు కేసు నమోదైంది. బాధిత బాలికలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్డెన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
హాస్టల్ బాలికలను లైంగికంగా వేధిస్తూ, వారిలో కొందరిని పర్యాటక ప్రాంతాల పేరుతో లాడ్జిలకు తీసుకెళ్లి శశికుమార్ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనాధ బాలికలు కావడంతో వారిని బెదిరించి లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.