పేజర్ల పేలుళ్ల నుంచి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా తేరుకోకముందే, వాకీటాకీలు పేలాయి. హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా వాకీటాకీల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య 24కు చేరింది. దాదాపు 3450 మంది గాయపడ్డారు. పేజర్ల పేలుళ్లలో హతమైన వారి సంఖ్య 12కు పెరిగింది. మొత్తం మీద గత మూడు రోజులుగా పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ అట్టుడికిపోయింది. ఈ పేలుళ్లు ఇజ్రాయెల్ నిఘా సంస్థ పనేనని హెజ్జొల్లా ప్రకటించింది.
ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించిన హెజ్బొల్లా, ఐడీఎఫ్ ఆయుధ డిపోలపై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.