భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు
నూతన మద్యం విధానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లతో పాటు సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని భేటీలో నిర్ణయించారు.
భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేసింది. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ పై కేబినెట్ లో సమాలోచనలు చేశారు. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని, 2023లో పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని మంత్రులు తెలిపారు.
పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పాత ఏజన్సీకే ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ‘స్టెమీ’ పథకం ప్రారంభం, ఆధార్ తరహాలో విద్యార్థులకు ‘అపార్’ గుర్తింపు కార్డులు జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖాల్లో కలిపేలా చర్యలు చేపట్టే విషయమై మంత్రివర్గంలో చర్చ జరిగింది.