జమిలి ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ కు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రవేశపెట్టనున్నారు.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ అందజేసిన నివేదికను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ కు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ లో కేంద్ర ప్యానల్ ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ నివేదికను కేంద్రానికి అందజేసింది. అయితే న్యాయశాఖ ఆ రిపోర్టును నేడు కేంద్ర కేబినెట్ ముందు ప్రవేశపెట్టింది. లోక్ సభ ఎన్నికలతో పాటే రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సూచించింది.
ప్రస్తుత ఎన్డీయే సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు ఉంటాయని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగంలో కూడా జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు.