ఆంధ్రప్రదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ మాత్రం తిరిగి బాధితులపైనే కేసులు పెడుతుందని వీహెచ్‌పీ, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడులకు పాల్పడిన ముస్లింలను వదిలేసి , బాధితులైన హిందువులను కేసుల పేరిట వేధించడమేంటని నిలదీస్తున్నారు. ఏపీలోని పాలకపక్షం తీరుతో హిందువులు మెజారిటీగా ఉన్న రాష్ట్రంలోనే మనం ఉన్నామా అనే సందేహం వస్తోందని దుయ్యబట్టారు.
పెడన ఘటనను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ కూడా ఖండించారు. దేవాలయం, వినాయకమండపంపై ముస్లింలు దాడులు చేయడం హేయమైన చర్య అని ఓ ప్రకటనలో తెలిపారు. దాడిని అడ్డుకోబోయిన పోలీసులపై కూడా రాళ్ళ దాడికి పాల్పడం దారుణమన్నారు. నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
చిత్తూరు జిల్లా వీకోటలో హిందువులపై ముస్లింలు దాడి చేశారని ఈ ఘటనలో పోలీసులు తీరు విచిత్రంగా ఉందని హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల కిందట ఈ సంఘటన జరిగిందని గుర్తు చేశారు.
వినాయక చవితి సందర్భంగా కూడా మండపాలకు చలాన్లు విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. విగ్రహాల ప్రతిష్టించుకునేందుకు, స్థానికుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పడం, ప్రభుత్వ అధికారుల అనుమతి తప్పని సరి అని నిబంధలను పెట్టడం దేనికి సూచకం అని మండిపడుతున్నారు.
కృష్ణా జిల్లా పెడనలో ఇదే తరహా ఘటన జరిగిందని హిందూ సంఘాల నేతలు చెబుతున్నారు. ముస్లింలు హిందువులపై దాడులకు పాల్పడటంతో పాటు దేవాలయాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. దాడులు జరిగి మూడు రోజులు అవుతున్నా కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్, కశ్మీర్ లోయలో ఇస్లామిక్ తీవ్రవాదులు , హిందువులను వేధిస్తున్నట్లే ఏపీలో కూడా దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరమన్నారు.
విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్రకార్యలయంలో జరిగిన సమావేశంలో పెడన దాడికి సంబంధించిన విషయాలను వీహెచ్పీ రాష్ట్రప్రధాన కార్యదర్శి తనికెళ్ల రవికుమార్ మీడియాకు వివరించారు. వందలాది ముస్లింలు శివాలయంపై దాడి చేసి హిందువులపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. అడ్డుకున్న పోలీసులపై కూడా రాళ్ళదాడికి దిగారని ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారని ఆయన చెప్పారు.
‘‘హిందూ దేవాలయం, వినాయకుడి మండపం వద్ద ఇస్లాం మతానికి సంబంధించిన ఫ్లెక్సీలను కొందరు ముస్లింలు ఏర్పాటు చేశారు. ఈ చర్యను అడ్డుకుని హితవుపలికిన హిందువులపై ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లింలు మూకదాడికి పాల్పడ్డారు. దేవాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్న పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. వినాయక చవితి మండపాలకు నిబంధలను పెట్టే ప్రభుత్వం, హిందువులపై దాడులకు పాల్పడ్డప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దాడి చేసిన వారిని గుర్తించడం ఎందుకు జాప్యం జరుగుతుంది.’’ అని రవికుమార్ తెలిపారు.
ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే హిందూ సమాజాన్ని రక్షించే బాధ్యతను వీహెచ్పీ తీసుకుంటుందన్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన మూల్య చెల్లించుకోవాల్సి వస్తుందని దాడికి పాల్పడిన వారిని హెచ్చరించారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలన్నారు
పెడనలోని మదర్సా కు సరైన అనుమతులు లేవన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.గోహత్యలు కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని వాటిపై ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేవని చెప్పారు.