పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు మరోసారి సత్తా చాటింది. చైనా వేదికగా జరిగిన ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ) ఫైనల్లో చైనాను ఓడించి మరోమారు టైటిల్ విజేతగా అవతరించింది. 1-0తో చైనాను ఓడించిన భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా ఐదోసారి ఏసీటీ టైటిల్ సాధించింది. లీగ్ దశలో భారత్‌కు అలవోకగానే లొంగిన చైనా ఫైనల్లో మాత్రం హోరాహోరీగా పోరాడింది.
ఏసీటీలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. 2011లో ప్రారంభించిన ఈ టోర్నీ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్ మరుసటి ఏడాది రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2016, 2018లో టైటిల్స్ గెలిచింది. 2023, 2024లోనూ సత్తా చాటింది. మొత్తం 8 మార్లు టోర్నీ జరగగా భారత్ ఐదుసార్లు విజేత కాగా ఒకసారి రన్నరప్‌గా నిలిచింది.