తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాణి కుముదిని నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పార్థసారధి పదవీకాలం ఈ నెల 8తో ముగిసింది. దాంతో ఆయన స్థానంలో రాణి కుముదినిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
మూడేళ్ళ పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు.1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ సేవలు అందించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐఏఎస్ గా పదవీ విరమణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.