ఢిల్లీ నూతన సీఎం అభ్యర్థిగా మంత్రి అతిశీ పేరును ఆప్ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో సమావేశమైన ఆప్ శాసనసభాపక్షం అతిశీ పేరును నూతన సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
ఇవాళ సాయంత్రం సీఎం కేజ్రీవాల్ తన రాజీనామాను ఢిల్లీ లెస్టినెంట్ గవర్నర్‌కు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తన పదవికీ రాజీనామా చేయబోతున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ సోమవారంనాడు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదు