ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన నేడు (సెప్టెంబర్ 17)న 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖలు ఆయనకు స్వయంగా ఫోన్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కొందరు నేరుగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సాధించిన విజయాలు, దేశానికి చేస్తున్న సేవలను కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిత్వం, పని బలంతో అసాధారణ నాయకత్వంతో దేశ శ్రేయస్సు, ప్రతిష్టను పెంచారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. వినూత్న ప్రయత్నాలతో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఎంచుకున్న మార్గం సుగమం కావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. పీఎం నరేంద్రమోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ సోషల్ మీడియాలో తెలిపారు.
ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అవిశ్రాంతమైన కృషి, పట్టుదల, దూరదృష్టి దేశప్రజల జీవితాల్లో పలు మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.
కేంద్రమంత్రి, బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా ‘ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అంత్యోదయ అనే మంత్రంతో ప్రతీ క్షణాన్ని దేశానికి, దేశ ప్రజలకు అంకితం చేసి విజయవంతమైన ప్రధానిగా నిలిచారు’. అని ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు, వన్ ఇండియా- బెస్ట్ ఇండియా మార్గదర్శి ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని యూపీ సీఎం యోడీ ఆదిత్యానాథ్ పేర్కొన్నారు.
తన జన్మదినం సందర్భంగా ఒడిశాలో 26 లక్షల పీఎం ఆవాస్ నివాసాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ప్రధాని అసమానమైన నాయకత్వంలో, దేశం వికసిత్ భారత్ వైపు అధిక వృద్ధి పథంలో పయనిస్తోందని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ అన్నారు. దేశ సేవలో దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాని ట్వీట్ చేశారు. సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ మోదీకి విషెస్ తెలిపారు.
త్రిపుర సీఎం మాణిక్ సాహా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి లు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరింత ఆరోగ్యంగా జీవించాలని దేవుడిని ప్రార్థించారు.