మహిళా డాక్టర్లపై దౌర్జన్యాలు ఆగడం లేదు. ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన మరవక ముందే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై దౌర్జన్యం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఏలూరు జిల్లా దెందులూరు మండలం ఉండ్రాజవరంలో కొందరు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు గాయపడ్డారు. మెడికల్ లీగల్ కేసుకు సబంధించి ఎమ్మెల్సీ ఇవ్వాలని గాయపడ్డ వారి తరపున వచ్చిన బొడ్డేటి మోహన్ డాక్టర్‌ను అడిగారు. వైద్యం పూర్తి కాగానే ఇస్తామని డాక్టర్ చెప్పినా వినకుండా, మహిళా డాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, దౌర్జన్యానికి దిగాడు. ఏలూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని బాధితురాలు చెప్పారు.
ఆసుపత్రి భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ దారుణంపై డాక్టర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంగళవారం నిరసనకు పిలుపునిచ్చాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.