బంగారు గనికోసం జరిగిన సాయుధ పోరాటంలో 30 మందికిపైగా మృతిచెందారు. ఈ ఘటన పపువా న్యూ గునియాలో చోటు చేసుకుంది. పోర్గెరా బంగారు గనిని ఆగష్టులో సకార్ తెగవారు ఆక్రమించుకున్నారు.గనిపై హక్కులు పయాండె తెగ వారికున్నాయి. ఇరు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఇరు వర్గాలు ఆటోమేటెడ్ తుపాకులతో కాల్పులకు దిగారు. ఈ సాయుధ పోరాటంలో 50 మంది దాకా చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
పపువా న్యూ గినియాకు వచ్చే ఆదాయంలో ఈ బంగారు గని నుంచే 10 శాతం దాకా ఆదాయం వచ్చేది. అయితే వివాదాలు నెలకొనడంతో గనిని కెనడా జాతీయుడికి అప్పగించారు. తాజాగా బంగారు గని కోసం జరిగిన కాల్పుల్లో 50 మంది వరకు చనిపోవడంతోపాటు, సమీపంలో భవనాలకు నిప్పుపెట్టారు. వాహనాలు తగులబెట్టారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఆయుధాలతో సంచరించే వారిని కాల్చి చంపేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.గతంలోనూ ఈ బంగారు గని కోసం పోరాటాలు జరిగాయి. 2021లో ఇరు వర్గాల మధ్య సాయుధ పోరులో 17 మంది చనిపోయారు. తాజాగా గని ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 2 వేల మంది చనిపోయిన సంగతి తెలిసిందే.