తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టాయి. ప్రధాని మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్ విధానంలో వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. హైదరాబాద్ నాగపూర్, దుర్గ్ విశాఖ మధ్య కొత్త వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టాయి. దేశంలోనే మొదటి సారిగా వందే మెట్రోను ప్రధాని ప్రారంభించారు. అహ్మదాబాద్ భుజ్ మధ్య వందే మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో మెట్రో సేవలు అందిస్తారు.
అధునాతన బోగీలతో వందే మెట్రో పరుగులు ప్రారంభించింది. అధునాతన సీటింగ్ ప్రయాణీకులను ఆకర్షించేలా ఉంది. గతంలో ఏ మెట్రోలో లేని సదుపాయాలు వందే మెట్రోలో కల్పించారు. రాబోయే రెండేళ్లలో వంద మెట్రోరైళ్లు ప్రారంభించాలని లక్ష్యంగా రైల్వే శాఖ పనిచేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు నగరాలకు వందేభారత్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో సుదూర ప్రయాణీకుల కోసం వందేభారత్ స్లీపర్ కోచ్లు అందుబాటులోకి రానున్నాయి.