అమెరికా మాజీ అధ్యక్షుడు, త్వరలో జరగబోయే అధ్యక్ష రేసులో దూసుకెళుతోన్న డానాల్డ్ ట్రంప్‌కు అతి సమీపంలో కాల్పుల ప్రయత్న ఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్‌లో గోల్ఫ్ ఆడుతోండగా ట్రంప్‌కు అతి సమీపంలో నార్త్ కరోలినాకు చెందిన రౌత్ ఏకే 47తో కాల్పులకు దిగబోయాడు.ఇంతలోనే భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందించారు. తనను అంతం చేయానుకుంటున్నారని, అది సాధ్యం కాదని, ఎవరికీ భయపడేదే లేదని స్పష్టం చేశారు.
ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ట్రంప్ లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే తృటిలో ప్రమాదం తప్పింది. తాజాగా మరోసారి ట్రంప్‌పై కాల్పులు జరిపే ప్రయత్నం చేయడం, భద్రతా దళాలు అడ్డుకోవడం జరిగింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. కాల్పుల ప్రయత్నాన్ని ఖండించారు. ట్రంప్‌కు రక్షణ పెంచాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
కేసు విచారిస్తున్న ఎఫ్బిఐ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. ట్రంప్‌ను హత్య చేసేందుకే దుండగుడు రౌత్ ఏకే 47 సిద్దం చేసుకున్నాడని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. అయితే దుండగుడి సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా సంచలన విషయాలు వెలుగు చూశాయని ఎఫ్బిఐ తెలిపింది. ఫైట్ అండ్ డై అంటూ రౌత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ట్రంప్ హత్యకు పథకం పన్నినట్లు మరింత బలపరచినట్లైందన్నారు. అయితే రౌత్ కిరాతకుడు కాదని ఆయన కుమారుడు చెప్పుకొచ్చారు .