టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ తనను అత్యాచారం చేశాడంటూ ఓ డాన్సర్ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్టేషన్ ఆఫీసర్ వెంకన్న జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును నార్సింగి స్టేషన్‌కు బదిలీ చేశారు.
తనను జానీ మాస్టర్ పలు మార్లు అత్యాచారం చేశాడని, సినిమా షూటింగులకు ముంబై తీసుకెళ్లి అక్కడ కూడా రేప్ చేశాడని ఓ మహిళ ఫిర్యాదులో తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.