ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ మాజీ కమిషనర్ కాంతిరాణా, మరో ఐపీఎస్ విశాల్ గున్నీని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై పలు అభియోగాలు ఉన్నాయి. ముంబై నటి
కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడంతో పాటు ఇతర విషయాల్లోనూ పరిధి దాటి వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జత్వానీ కేసులో గతంలో విజయవాడలో పనిచేసిన ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.