హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం కామొరోస్ అధ్యక్షుడు అజాలీ అసౌమనిపై ఓ సైనికుడు కత్తితో దాడికి దిగాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో అసౌమని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కామొరోస్లో మతపరమైన కార్యక్రమానికి హాజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజే దుండగుడు పోలీస్ లాకప్‌లో శవమై కనిపించాడు. తిరుగుబాటుదారులను, ప్రతిపక్షగళాలను అణచివేయడంలో అసౌమని మొదటి నుంచి దూకుడుగానే వ్యవహిస్తాడని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
1999లో తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన అసౌమని తరవాత రెండు సార్లు ఎన్నికల్లో గెలిచారు. నాలుగోసారి అధ్యక్షుడిగా చేసేందుకు రాజ్యాంగాన్ని నిబంధనలన్నీ తుంగలో తొక్కి సవరించారు.