కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ వర్చువల్గా ఆరు వందేభారత్ రైళ్లు ప్రారంభించారు. బ్రహ్మపూర్ టాటానగర్, టాటానగర్ పాట్నా, రూర్కెలా హౌరా, గయా హౌరా, భాగల్పూర్ హౌరా, డియోఘర్ వారణాసికి ఆరు వందేభారత్ రైళ్లును ప్రధాని ఇవాళ ప్రారంభించారు. ఈ ఆరు మార్గాల్లో వందేభారత్ పరుగులు తీయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నాగపూర్, దుర్గ్ విశాఖ మధ్య రెండు కొత్త వందేభారత్ రైళ్లు రానున్నాయి. ఇక దేశంలోనే మొదటి సారిగా వందే మెట్రో అందుబాటులోకి రాబోతోంది. అహ్మదాబాద్ భుజ్ మధ్య నడిపే వందే మెట్రోను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. మరో రెండు మాసాల్లో వందేభారత్ స్లీపర్ కోచ్ సదుపాయం కలిగిన రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో వందేభారత్ రైళ్ల సంఖ్య 400కు చేరనుంది.