టైమ్స్ మ్యాగజైన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాను ప్రకటించింది. ప్రపంచంలోనే వెయ్యి అత్యుత్తమ కంపెనీల్లో, భారత్‌కు చెందిన 22 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు వరుసగా 112, 119, 134 ర్యాంకులు పొందాయి. ఉద్యోగుల సంతృప్తి స్థాయి, పర్యావరణ సామాజిక పాలన, ఆదాయాల వృద్ధి అంశాల ఆధారంగా కంపెనీలకు ర్యాంకులు కేటాయించారు. కుబేరుల జాబితాలో టాప్ పదిలో ఉన్న అదానీ, రిలయన్స్ కంపెనీలకు వరుసగా 736, 646 ర్యాంకులు దక్కాయి.
ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉత్తమ కంపెనీల జాబితాలో చోటు దక్కింది. ఎస్‌బిఐకి 518వ ర్యాంకు లభించింది.ఐసిఐసిఐ 525, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 850వ ర్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకుకు 551వ ర్యాంకు దక్కింది. ఫార్మీ దిగ్గజం సిప్లాకు 957వ స్థానం లభించింది.