భారీగా జీఎస్టీ ఎగవేస్తోన్న సంస్థలను ఇంటెలిజెన్స్ గుర్తించింది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఆన్లైన్ గేమింగ్, ఆర్థిక, బీమా, బ్యాంకింగ్ సేవలు, తుక్కు రంగంలో 2.01 లక్షల కోట్ల పన్నులు ఎగవేసినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ వెల్లడించిది. అంతకముందు ఆర్థిక సంవత్సంలో 4872 జీఎస్టీ ఎగవేత కేసులు నమోదు కాగా, 2023-24లో అవి 6084కు పెరిగాయి. పన్నులు ఎగవేసిన వారిలో గత ఆర్థిక సంవత్సరం రూ.26605 కోట్లను స్వచ్ఛంధంగా చెల్లించారని డీజీజీఐ నివేదిక స్పష్టం చేసింది.
మొత్తం కేసుల్లో 46 శాతం జీఎస్టీ ఎగవేతకు సంబంధించినవి కాగా, 20 శాతం నకిలీ పన్ను క్రెడిట్‌కు, 10 శాతం తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఐటీసీ పొందినవిగా డీజీజీఐ నివేదిక తెలిపింది. గేమింగ్ రంగంలో అత్యధికంగా పన్ను ఎగవేతను గుర్తించారు. 78 కేసుల్లో రూ.81,875 కోట్లు జీఎస్టీ ఎగ్గొట్టారని డీజీజీఐ గుర్తించింది. ఆ తరవాత స్థానంలో బీఎఫ్ఎస్ఐ రంగాలున్నాయి. ఈ విభాగంలో 171 కేసులు నమోదు చేశారు. వీటి విలువ రూ.18,961 కోట్లుగా ఉంది. జీఎస్టీ ఎగవేత 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.7879 కోట్లు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.01 లక్షలకు పెరిగడం గమనార్హం.