ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాక్ ను 2-1తో ఓడించింది. ఏడో నిమిషంలో పాక్ ప్లేయర్ అహ్మద్ నదీమ్ గోల్ చేశాడు. అయితే ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్, రెండు గోల్స్ చేసి భారత్ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.
ఆట 13వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తొలి గోల్ చేశాడు. మళ్ళీ 19వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ ను డ్రాగ్‌ఫ్లిక్‌తో రెండో గోల్ చేశాడు. రెండు గోల్స్‌తో టీమిండియా లీడింగ్‌లో ఉన్నా.. బలమైన పాకిస్తాన్ కూడా విరోచితంగా పోరాడింది. అయితే ఓ దశలో పాక్ ప్లేయర్ అష్రఫ్ రాణా ఆట నిబంధనలు ఉల్లంఘించి దురుసుగా ప్రవర్తించాడు. ప్రవర్తన సరిగాలేకపోవడంతో టీవీ అంపైర్ అతడికి ఎల్లో కార్డు జారీ చేశాడు. చివరలో రెండు జట్లూ కేవలం పది మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది.