వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన నేతలు, విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు 41 ఏ నోటీసులు అందించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలకు చెందిన పాసుపోర్టులను పోలీస్ స్టేషన్లో అందజేయాల్సి ఉంది.
మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై 2021లో దాదాపు 300 మంది దాడికి దిగిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఈ కేసులో ఇప్పటికే 82 మందిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల శివరాం, లేళ్ల అప్పిరెడ్డిలపై కేసు నమోదు చేశారు. కేసు విచారణ జరుగుతోంది.