ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా నియంత్రించేందుకు గతేడాది ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది.
ప్రభుత్వం తొలుత ఆంక్షలు విధించిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చింది.
ఈ ఏడాది మే నెలలో ఆ సుంకాన్ని రద్దు చేసింది. అదే సమయంలో టన్ను ఉల్లి ఎగుమతికి 550 డాలర్లు(రూ.46 వేలు) కనీస ధరగా నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువకు ఉల్లిని విదేశాలకు అమ్మకూడదని తెలిపింది. ఫలితంగా జూన్‌లో ఉల్లి ఎగుమతులు సగానికి పైగా తగ్గిపోయాయి.
2024-25 ఏడాదికిగాను జులై 31, 2024 వరకు 2.60 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 17.17 లక్షల టన్నులు ఎగుమతి చేశారు.