వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన బాగ్బహారా పరిధిలో చోటు చేసుకుంది. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ నుంచి విశాఖకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు రాళ్లు విసరడంతో అద్దాలు పగిలాయి. దీనిపై రైల్వే పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు…
రాళ్ల దాడిలో మూడు బోగీల అద్దాలు పగిలాయి. బాగ్భహారా ప్రాంతంలో రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఆకతాయిలు రాళ్లు విసిరారని గుర్తించిన రైల్వే పోలీసులు ఆ ప్రాంతంలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న ప్రధాని మోదీ రెండు వందేభారత్ రైళ్లను అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రెండు కొత్త వందేభారత్ రైళ్లలో ఒకటి హైదరాబాద్ నాగపూర్ మధ్య, మరొకటి దుర్గ్ విశాఖ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.
దుర్గ్ విశాఖ రైలు మూడు రాష్ట్రాల్లో 565 కి.మీ ప్రయాణిస్తుంది. దుర్గ్‌లో ఉదయం 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.45కు విశాఖ చేరుతుంది. విశాఖలో మరలా 2.50కు బయలు దేరి రాత్రి 10.50కి దుర్గ్ చేరుతుంది.