భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్ర లో చిక్కుకున్న తెలుగు యాత్రీకులు క్షేమంగా సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులు వారిని ఈరోజు ఉదయం వేరే ప్రాంతానికి తరలించారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది యాత్రీకులు కేదార్నాథ్లో ప్రతికూల వాతావరణం మధ్య మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. తాము ఆపదలో ఉన్నామని, కిందకు చేరుకోలేకపోతున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి తెలిపారు.
ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ కు ఎంపీ వివరించారు. ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మంత్రి లోకేశ్ మాట్లాడారు. తెలుగు యాత్రీకులను సురక్షితంగా స్వరాష్ట్రాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే కొంతమంది యాత్రీకులు గుప్తకాశీకి చేరుకున్నారు.